విశాఖ సౌత్ రైల్వే జోన్ కి జిఎంను నియమించిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ…. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల విశాఖ రైల్వే జోన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జిఎంగా నియమితులైన సందీప్ మధుకు అభినందనలు. ఆయన బాధ్యతలు బాద్యయుతంగా నిర్వర్తించి రైల్వేజోన్ అభివృద్ది కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. విశాఖ రైల్వే జోన్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
