ఒంగోలు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఏర్పాటు చేస్తున్న ఎం.ఎన్.సి.యు , ఎస్.ఎన్.సి.యు ల ద్వారా అవసరమైన మౌలిక సదుపాయాలతో నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, వైధ్యాదికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్)ని మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ , స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ లలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి వైధ్యాదికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ , స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ లలో అన్నీ మౌలిక సదుపాయాలతో నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు విభాగాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట డిసిహెచ్ఎస్ డా శ్రీనివాస నాయక్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్) సుపరింటెండెంట్ డా ఏడుకొండలు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.



