రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులు కృష్ణమోహన్ ఆకెపాటి ఆదేశాల మేరకు ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్ర గ్రంథాలయం కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ఆహ్వానంతో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇంచార్జ్ గోపాలకృష్ణ రోణంకి శనివారం ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటగా కార్యదర్శి వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమ నివేదికను చదివి వినిపించారు.
జాయింట్ కలెక్టర్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ… భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి గ్రంధాలయాన్ని ఉపయోగించుకోవాలని పుస్తకాలు నిరంతరం చదువుతూ మంచి పౌరులుగా ఎదగాలని బాల్యంలో సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని తల్లిదండ్రులు కూడా పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా పుస్తకాలు ఇచ్చినట్లయితే పిల్లలు బాగా తయారవుతారని పిల్లలు బాల్యంలో చేయకూడని పనులను మంచి భవిష్యత్తు కోసం మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సవివరంగా తెలియజేశారు.
శిక్షణ శిబిరంలో పిల్లలకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యోగాంధ్ర పర్యావరణ పరిరక్షణ పేదరిక నిర్మూలన, పిఫోర్ పథకం అమలు గురించి అమరావతి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ కథా రచన పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు, పాల్గొన్న ప్రతి విద్యార్థికి శిక్షణ నిర్వాహకులకు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు బహుమతి ప్రధానం సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది
ఈ వేసవి శిక్షణ శిబిరం నిర్వహణకు యోగ శ్రీనివాసరావు, ఇంగ్లీష్ గ్రామర్ వి వెంకయ్య, ఆర్ బిందుమణి క్రాఫ్ట్ హ్యాండ్ రైటింగ్, సృష్టి ఆర్ట్ అకాడమీ టి రవీంద్ర, శిరీష, డి లక్ష్మీ ప్రసాద్ స్పేర్ టైం ఆక్టివిటీస్, కే నాగలక్ష్మి క్లాసికల్ డాన్స్, తరుణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్, జాలాది మోహన్ బాబు పర్సనాలిటీ డెవలప్మెంట్, రీడింగ్ లెర్నింగ్ టెక్నిక్స్ స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, తెలుగు పద్యాలు సూర్యకుమారి,కాశీ విశ్వనాథ్ ధ్యానం, మంచికంటి వెంకటేష్ స్టోరీ టెల్లింగ్ బుక్ రీడింగ్ బుక్ రివ్యూ కార్యక్రమాలను నిర్వహించారు.
పి పేరయ్య రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ 30 శాఖా గ్రంధాలయాలలో 610 మెంబర్షిప్ చేర్పించినందుకు జాయింట్ కలెక్టర్ చే సన్మానించడం జరిగింది.
అనంతరం ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ కాళహస్తి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వందన సమర్పణను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రంథాలయ సిబ్బంది జి శాంసన్, అనిల్, మృదుల్ కుమార్, శివకుమారి, గోవిందమ్మ, ఇమ్మానియేల్ పాల్గొన్నారు.

