ప్రజా పిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ – ప్రజా పిర్యాదుల నిర్ణీత కాలపరిమితి లోపల విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలి – జిల్లా ఎస్పీ-పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమంకు 79 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు వారి యొక్క వ్రాతపూర్వక అర్జీలను జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ఫిర్యాదుదారులు అధికారులకు విన్నవించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, నిర్ణీత గడువులోపు విచారించి పరిష్కరిస్తామని ఎస్పీ వారికి భరోసా కల్పించారు. ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని, త్వరితగతిన తగిన న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….

ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న మూడు కార్లను బాడుగకు తీసుకున్న ఒంగోలు సమతా నగర్‌కు చెందిన వ్యక్తి, ‘ఒంగోలు సమీపంలో కొత్తగా ఒక వెంచర్ ప్రారంభిస్తున్నామని చెప్పి కార్లు తీసుకోని గత ఏడు నెలలుగా కార్ల బాడుగు డబ్బులు ఇవ్వకుండా, కార్లను కూడా తిరిగి ఇవ్వకుండా అడుగుతుంటే బెదిరిస్తున్నాడని ఫిర్యాదు.

ఒంగోలులోని ఉన్న తన యొక్క ఇంట్లో ఒంగోలుకు చెందిన ఒక ఆమె మరియు అతని యొక్క కుటుంబ సభ్యులు అద్దెకు ఉంటూ చాలాకాలంగా అద్దె డబ్బులు చెల్లించకపోగా, ఇల్లు ఖాళీ చేయమని చెప్పితే ఖాళీ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సంతనూతలపాడు మండలం, మంగమూరు గ్రామానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *