బాలికలు చెడుగా ప్రవర్తించే వారి పట్ల ఎప్పటిక
ప్పుడు అప్రమత్తంగావుండాలని ఎస్సై ఎస్.మల్లిఖార్జునరావు కోరారు. స్థానిక కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఎస్సై ఆధ్వర్యంలో గుడ్ టచ్ -బ్యాడ్ టచ్ పై బాలికలకు మంగళవారం అవగాహన కల్గించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ….గ్రామాల్లో పాఠశాలల వద్ద సహచర పురుష విద్యార్థులు, ఉపాద్యాయులు, బంధువులు బాలికలను తగలరాని చోట తగిలితే వెంటనే డోంట్ టచ్ అంటూ గట్టిగా హెచ్చ రించాలని తెలిపారు. సమాజంలో బాలికల పట్ల కొందరువ్యక్తులు వికృతంగా వ్యవహరిస్తే డోంట్ టచ్ అంటూ ధైర్వంగా హెచ్చరించి, తమను తాము కాపాడుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడుపుతూ తమ విలువైన ప్రాణాలు కాపాడు కోవాలన్నారు. ఇతర వ్యాపకాలతో కాలక్షేపం చేసి చెడు మార్గం వైపు పయనించకుండా ఉన్నత చదువులు పూర్తికాగానే మంచి ఉద్యోగాలు పొంది కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకరావాలన్నారు. గ్రామాంలోని షాపుల్లో గంజాయి, గుట్కా అమ్మకాలు, నిల్వలపై సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.
