గ్రామాల ప్రగతిపై సచివాలయసిబ్బంది ప్రత్యేకదృష్టి సారించాలి- తాళ్లూరు మండల ప్రత్యేకాధి కారి వెంకటేశ్వరరావు

గ్రామాల ప్రగతిపై సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నపుడే వేగవంతంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బీసీ కార్పోరేషన్ ఈడీ, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక మం డలపరిషత్ సమావేశం హాలులో పంచాయితీ పురోగతి సూచికపై శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈసందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ… ప్రజలను భాగస్వాములను చేసి వారి సహాకారం పొంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద వర్గాలకు అందించేలా సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది బాధ్యతా యుతంగా ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేసి గ్రామాలు అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రధానంగా తాగునీరు, ఆరోగ్యం పై దృష్టి సారించి
ఆయాశాఖల అధికారులు ప్రజలకు మంచినీరు అందిం చేలా, మురుగు నిల్వ వుండి ప్రజలు ఆనారోగ్యం పాలు కాకుండా చూడాలన్నారు.
గ్రామాల్లో పేద వర్గాల ప్రజలకు ప్రభుత్వం గృహాలుమంజూరు చేసేలా, మంజూరైన గృహాలను త్వరిత గతిన పూర్తి చేసుకునేలా చూస్తే గ్రామాలు అభివృద్ధి పథం లో నిలుస్తాయన్నారు. మండలస్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సమ న్వంతో పని చేస్తూ మండలాన్ని జిల్లాలో అగ్రగామిగా నిలిచేలా చూడాలని తెలిపారు.
రిసోర్స్ పర్సన్ కళ్యాణ్ శిక్షణ ఇస్తూ …గ్రామపంచాయతీల అభివృద్దికోసం గ్రామ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగితే గ్రామం అభివృద్ధివైపు పయనిస్తున్నారు. ఏ విభాగానికి ఎంత నిధులు వెచ్చించాలో ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు సిద్ధంచేయాలన్నారు. గ్రామపంచాయతీ పురోగతి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పలు అంశాలపై సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అడ్మిస్ట్రేషన్ అధికారి సానికొమ్ము సత్యం, ఎంఈవో జి.సుబ్బయ్య, ఏపీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం దేవరాజ్, అన్ని గ్రామాల సచివా లయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *