ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సాహాన్ని వినియోగించుకొవాలి – దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ

ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సాహాన్ని వినియోగించుకుని విద్యార్థులు తమ జీవితంలో లక్ష్యాన్ని నిర్ధారించుకుని సాధనకు కృషి చెయ్యాలని దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ కోరారు. తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మోగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానోపాధ్యాయుడు వైఎన్ ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ లక్ష్మినారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ … గతంలో తాము అందరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉన్నత స్థాయికి వచ్చామని నాడు అన్ని నదుపాయాలు పాఠశాలల్లో లేవని అన్నారు. నేడు అన్ని సౌకర్యాలను ప్రొత్సాహాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు మంచి నడవడిక కలిగి ఉండాలని, సమాజంలో జరుగుతున్న మోసాలను గ్రహించి అడ్డుకుని ముందుకు సాగాలని కోరారు. మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు, ఎన్ఐ మల్లిఖార్జున రావు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాళ్లూరు వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి పాల్గొని సందేశం ఇచ్చారు. తాళ్లూరు ప్రాధమిక పాఠశాల ఏఏలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య పాల్గొని సందేశం ఇచ్చి బహుమతులు అందించారు.
ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఘనంగా నిర్వహణ …..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మోగా పెరెంట్స్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తీసుకుంటున్న చర్యల గురించి ఎంఈఓ – 1 జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావులు వివరించారు. పలు పోటీలు నిర్వహించి విద్యార్థులకు, తల్లులకు బహుమతులు అందించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, దోసకాయలపాడు ప్రాధమిక పాఠశాల, తూర్పుగంగవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జాహ్నవి పాఠశాలను, ఎపీఓ దేవ రాజ్ గీతాంజలి, శారద, గంగా, ప్రగతి హైస్కూళ్లను, జి నుబ్బయ్య మండల విద్యాశాఖాధికారిని తాళ్లూరు వికే ఉన్నత పాఠశాల, కెజీ బివి, వికే జూనియర్ కాలేజి విఠలాపురం ప్రాధమిక పాఠశాలను, మండల విద్యాశాఖాధికారి – 2 సుధాకర రావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాల, నాగంబొట్ల పాలెంకు, ఐసీడీఎన్ సూపర్ వైజర్ బి ఇందిరా
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజానగరం, ఎబీసీ హైస్కూల్, తాళ్లూరు లను, బి ప్రసాద రావు వ్యవసాయాధికారి ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివ రామపురం, నరస్వతి హైన్కూల్, తాళ్లూరుకు, ప్రాధమిక పాఠశాల మాధవరం లకు ఎన్ వాలి బాబు, ఆర్ డబ్ల్యు ఎన్ ఎఈ ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తురక పాలెంకు ప్రాధమిక పాఠశాల, దారం వారి పాలెం లను జి ఫణీంద్ర, డిప్యూటీ తహసీల్దార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొద్దికూరపాడు, అమెరికా పబ్లిక్ న్కూల్ లను, కె వెంకటేశ్వర్లు, ఎపీఓ ఎం ఎన్ఆర్ జీఎన్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెలుగు వారి పాలెం, ప్రాధమిక పాఠశాల మాధవరంలను, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు ఎన్ సత్యం ప్రాథమిక పాఠశాల కొర్రపాటి వారి పాలెం, ప్రాథమిక పాఠశాల తాళ్లూరు ఎఎలను సందర్శించి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మండల ప్రత్యేక అధికారి మండలంలోని అన్ని పాఠశాలలో సమావేశాలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *