ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు తేవడం జరుగుచున్నదని, అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలో, జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
గురువారం ఉదయం కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం కె. బిట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యార్ధులతో కలసి విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ విద్యా శాఖ లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ధి పరుస్తూ, విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని విద్యార్థులు బాగా చదివి జీవితంలో స్థిరపడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం 2.0ను ఒక పండుగ వాతావరణంలో నేడు నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారా లేదా.. ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించడమే మెగా పీటీఎం లక్ష్యమని, అలాగే తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతీ ఏడాది ఇదే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశం నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌… కొత్త రికార్డు సృష్టించబోతున్నదని, విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు…ఒకే రోజున 2 కోట్లా 28 లక్షల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఈ మెగా కార్యక్రమం గిన్నీస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కనున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లీప్ అనే విద్యా విధానాన్ని తీసుకు వచ్చి విద్యార్ధి యొక్క సామర్ద్యాన్ని బట్టి హోమ వర్క్ ఇస్తూ వారు మంచి నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు వుంటే అంతమందికి తల్లికి వందనం కింద నగదును అందచేయడం జరుగుచున్నదన్నారు. నేడు రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. అంబేద్కర్ గురుకులాలు, గిరిజన గురుకులాలు, ఎస్సి సంక్షేమ వసతి గృహాల చదువుచూ మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల సహకారంతో ఉచిత ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 కేంద్రాలలో ఉచిత ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం ఐఐటీలో 65 మంది విద్యార్ధులకు, నీట్ లో 50 మంది విద్యార్ధులకు సీట్లు లభించినట్లు మంత్రి తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తోన్నదని మంత్రి అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కె బిట్రగుంట కస్తుర్భా బాలికల విద్యాలయంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్ధులు ఐశ్వర్య, గమనిక, ఆదర్స్ లను వారి తల్లిదండ్రులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ విద్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్దులకు వసతి సదుపాయం లేదని, అలాగే ల్యాబ్ సదుపాయం లేదని మంత్రి దృష్టికి తీసుకు రాగా, మంత్రి స్పందిస్తూ వసతి, ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ…ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రులు పాఠశాలలకు చేరువైతే పాఠశాలలు అభివృద్ధి వైపు పయనమయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మొత్తం 2,955 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ, మరియు 188 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ హజరత్తయ్య మాట్లాడుతూ, నేడు విద్యార్ధులు చదువు పట్ల శ్రద్ద చూపుతూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. గుడ్ బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తత, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పూజ, లిఖిత ప్రియ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమం జరిగింది. విద్యార్థులు తమ తల్లులకు పాదాభి వందనం చేయగా, తమ పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలంటూ దీవించారు. ఆనంతరం విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, నియోజక వర్గ ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి , ఆర్డి ఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాస రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, ఎస్సి కార్పోరేషన్ ఈడి అర్జున్ నాయక్, సర్పంచ్ నాగరాజమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమణి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కె బిట్రగుంట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి, బహుమతులను ప్రదానం చేసారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *