తెలంగాణా సంసృతికి ప్రతీకగా బోనాలు – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, జూలై 20 :
(జే ఎస్ డి ఎం న్యూస్) విశిష్టమైన తెలంగాణా సంస్కృతికి బోనాలు వేడుకలు ప్రతీకలుగా నిలుస్తాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం బోనాలు వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సంప్రదాయబద్దంగా ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలోనే బోనాలు వేడుకలకు ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. ప్రతీ ఏటా బోనాలు వేడుకల సందర్భంగా ఆలయాల నిర్వాహకులకు ప్రభుత్వ పరంగా నిధులను అందించే పద్దతిని కూడా తామే ప్రవేశపెట్టమని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం సికింద్రాబాద్ పరిధిలోని దాదాపు 210 దేవాలయాలకు రూ.1.12 కోట్ల మేరకు నిధులను నిధులను అందించామని తెలిపారు. కట్ట మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసి విస్తరించేందుకు ఏర్పాట్లు జరిపామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం ఆలయానికి రూ.11 లక్షల మేరకు నిధులను అందించామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు జరపాలని సూచించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిలిచేందుకు వివిధ సంప్రదాయాలను గౌరవించాల్సి ఉందని తెలిపారు. ప్రజలందరూ ఆనందంగా బోనాలు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించి, శుభాకాంక్షలు తెలిపారు. పద్మారావు గౌడ్ తో పాటు ఆలయం కార్యనిర్వహణధికారి మహేందర్ గౌడ్, ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుంటి కృష్ణ, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, బీ.ఆర్.ఎస్. యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, బీ.ఆర్.ఎస్. నాయకులు కరాటే రాజు, జి.శేఖర్ ,కంది నారాయణ, సమన్వయకర్త రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జల మండలి అధికారులు ఏర్పాటు చేసిన మంచి నీటి ప్యాకెట్ల ఉచిత పంపిణీ శిబిరాన్ని పద్మారావు గౌడ్ ప్రారంభించారు.
దేవాలయాల సందర్శన
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బోనాలు వేడుకల్లో భాగంగా వివిధ దేవాలయాలను శాసనసభ్యులు పద్మారావు గౌడ్, యువ నేత రామేశ్వర్ గౌడ్ లు స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో కలిసి సందర్శించి ప్రత్యెక పూజలు నిర్వహించారు. బోనాలు సందర్భంగా అధికారులు జరిపిన ఏర్పాట్లను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కట్ట మైసమ్మ దేవాలయం వద్ద భక్తులతో పద్మారావు గౌడ్ ముచ్చటించారు. బోనం తో వచ్చిన భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్ లలో నిలవకుండా అధికారులు సహకరించాలని ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *