ఘనంగా పరిటాల జయంతి నిర్వహణ

టిడిపి దివంగత ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు శనివారం తూర్పుగంగవరంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి మైనార్టీ సెల్ నాయకులు షేక్ మహమ్మద్ బిల్లాలుద్దీన్ మాట్లాడుతూ …పీడిత ప్రజల స్వేచ్చ స్వాంతంత్య్రం సాధించిన ధన్యజీవి పరిటాల అని కొనియాడారు. దర్శి నియోజక వర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మీరామెహినుద్దీన్ మాట్లాడుతూ జనం హృదయాలలో నిత్యం వెలిగే చైతన్య జ్యోతి పరటాల అని అన్నారు. లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పరిటాల నసురేష్ ఆయన జీవిత చరిత్రను వివరించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రామలక్ష్మయ్య, హనుమల వెంకటేశ్వర్లు, జాస్తి నారాయణ, దుర్గయ్య, లక్ష్మయ్య, కోటి రెడ్డి, బద్దుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *