పలు బైకులను దొంగిలించిన దొంగలను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 13.50 లక్షల విలువైన 19 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… పోలీసులు మాట్లాడుతూ ఈ కేసులో పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం గురువాయుపాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి గాబ్రియల్, బండారు నవీన్, ఒక మైనర్ బాలుడి ని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిది స్వస్థలం గురువాయపాలెం గ్రామం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా. ముగ్గురూ ఒకే ఊరికి చెందినవారు కావడంతో స్నేహితులుగా ఉండి, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని పలు ప్రదేశాలలో నిలిపివున్న ద్విచక్ర వాహనాలను దొంగిలించారన్నారు.బండారు నవీన్ మరియు ఒక మైనర్ పై నరసరావుపేట I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ద్విచక్ర వాహనాల దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. ఎంతో దొంగలను పట్టుకున్న పోలీసులు సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.

