మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మంగళవారం జోరుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తీర ప్రాంతాలలో అలలు ఎగసి పడ్డాయి. జిల్లాలో మంగళవారం ఆరు గంటల వరకు 81.0 మి.మీల మేర వర్షపాతం నమోదు అయినది. దీంతో జిల్లాలో ప్రధాన వాగులు పొంగి ప్రవహించాయి. ప్రధాన వాగుల వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీస్ యంత్రాంగం ప్రమాదాల నివారణకు ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఒంగోలులో ప్రధాన రోడ్లతో పాటు లోతట్టు కాలనీలో వాగులను తలపించాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యవేక్షణ జోనల్ స్పెషల్ ఆఫీసర్ సిపోడియా, జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్, కలెక్టర్ రాజా బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సముద్ర తీర ప్రాంతాలలో పర్యటించి, పునరావాస కేంద్రాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ ద్వారాః ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
జిల్లాలో వర్షపాతం నమోదు ఇలా ….జిల్లాలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 94.0 మి.మీల మేర వర్షపాతం నమోదు అయినది. అందులో అత్యధికంగా కొత్త పట్నం 168.0 మి.మీలు శింగరాయకొండ లో 163.6, మి.మీలు, ఒంగోలు రూరల్, అర్బన్‌లలో 177.0, కొండేపి 165.0, పామూరు 128.4, పొన్నలూరు 176.8, టంగుటూరు 172.4, సంత నూతల పాడు 114.6, చీమకుర్తి 138.2, రాచర్ల 90.0,, సీఎస్ పురం 91.2, నాగులుప్పల పాడు 147.4, కొమరోలు 83.4,, జరుగుమల్లి
107.6, వెలిగండ్ల మర్రిపూడి లో లో 88.8, చొప్పున , పీసీపల్లి 114.4, పొదిలి 81.8, మద్దిపాడు 106.6, గిద్దలూరు 84.0, కనిగిరి 93.6, కె. కెమిట్ట 70.2, హెచ్ ఎం పాడు 101.2, మార్కాపురం 60.4, బేస్తవారి పేట 57.8, తర్లు పాడు 57.4, అర్ధవీడు 50.0, పెద్దార వీడు 44.2, దొనకొండ 40.2, దోర్నాల 22.8, తాళ్లూరు 80.4, దర్శి 55.0, యర్రగొండ పాలెం 22.2, ముండ్లమూరు 66.2, త్రిపురాంతకం 35.4, కురిచేడు 44.0, పుల్లల చెరువు 18.6 మి.మీల చొప్పున నమోదు అయినది.
20వేల ఎకరాలలో పంట నష్టం…..
జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 160గ్రామాలలో 9322 మంది రైతులకు చెందిన పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచలా వేసారు. జిల్లాలో జొన్న, సజ్జ, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశనగ, వరి పంటలు 1,22,615 ఎకరాలలో సాగు కాగా అందులో 20,375.5 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు తెలిపారు.




