కంటోన్మెంట్ జనవరి 23 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజక వర్గం పరిధిలోని అటల్ బిహారీ జూబ్లీ బస్టాండ్ ఆవరణలోని వాజపేయి పార్కు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై కంటోన్మెంట్ అధికారులు ప్రతాపం చూపారు. వారి నిర్మాణాలను బలవంతంగా
తొలగించారు. దీంతో వారు ఉపాధి లేక రోడ్డున పడ్డారు.ఈ విషయాన్ని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీ ఈటెల ఈ విషయాన్ని జాతీయ ఎస్టి కమిషన్ లో ఫిర్యాదు చేశారు. వారికి కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ నిర్మాణాలు చేసి పేదలకు కేటాయించే విధంగా కృషి చేశారు. దీంతో శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ఆవరణలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ,ఎంపీ ఈటెల రాజేందర్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. శుక్రవారం కంటోన్మెంట్ బోర్డ్ సాధారణ సమావేశంలో బానుక నర్మద మల్లిఖార్జున్ ప్రజలకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను ప్రస్తావించారు.
.ప్రధానంగా ఇటీవల జూబ్లీ బస్ స్టాండ్ ఆవరణలోని
అటల్ బిహారీ వాజపేయి పార్క్ ప్రక్కన ఖాళీ స్థలంలో కొందరు బీద ప్రజలు దుకాణాలు ఏర్పాటు చేసుకోగా, ఆ స్థలం రక్షణ శాఖ అధీనంలోని కంటోన్మెంట్ బోర్డు స్థలం కావడంతో నిర్మాణాలను తొలగించి పేదలను రోడ్డు పాలు చేశారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మల్లి ఖార్జున్,బి.యన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
