హైదరాబాద్ ఫిబ్రవరి 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 290 దరఖాస్తులు అందాయి.
వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 29, ఇందిరమ్మ ఇండ్ల కోసం 132, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 38 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్య ప్రకాష్, ఏ.సీ.పీ. ఉమేందర్ దరఖాస్తులు స్వీకరించారు.
సీఎం ప్రజావాణిలో 290 దరఖాస్తులు
03
Feb