ఆధునిక టెక్నాలనీ కాలంలో ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కలు (సెన్సెస్ )-2027లో ప్రభుత్వం అందించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ నమోదు) విజయవంతం చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు కోరారు. స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది తో కలసి సోమవారం సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ఎంపీడీఓ పి అజిత ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, రాష్ట్ర నాటక రంగ అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు నాయకులు, ఎంపీడీఓ కార్యాలయ, సచివాలయ సిబ్బంది పాల్గొని స్వీయ నమోదు చేసి ప్రతి ఒక్కరూ స్వీయ నమోదు చెయ్యాలని పిలుపునిచ్చారు.
