ఖైరతాబాద్ మే 4 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇంటి నిర్మాణ అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన ఓ జీహెచ్ఎంసీ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని సర్కిల్-37లో జూనియర్ అసిస్టెంట్ (రెవెన్యూ/టాక్స్)గా పనిచేస్తున్న బి. శ్రీలత ఈ ఘటనలో నిందితురాలిగా తేలారు.బాధితుడు తన ఇంటి నిర్మాణానికి సంబంధించి ‘మీ సేవ’లో దరఖాస్తు
చేసుకున్నప్పటి నుంచి అనుమతులు చేతికి వచ్చే వరకు సహకరించాలని శ్రీలతను కోరారు. ఇందుకు ఆమె ఏకంగా ఐదు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని రత్నదీప్ వద్ద మొదటి విడతగా ఒక లక్ష రూపాయలుతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు.
శ్రీలత వద్ద నుంచి లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆమె చేతులకు కెమికల్ పరీక్షలునిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి బాధితుడిని ఇబ్బందులకుగురిచేసినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో
హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
