తాళ్లూరు గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకుడు, తొలితరం విద్యాధికుడు ఇడమకంటి చిన (ఐ.సి) కోటిరెడ్డి(92) బుధవారం మృతి చెందారు. చిన కోటిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎస్ఈవోగా, బీడీవోగా మద్దిపాడు, కొండపి, తాళ్లూరు నమితీ లలో పని చేశారు. తాళ్లూరు నందు బిడివోగా పని చేస్తున్న సమయంలో యుక్త వయస్సులో వున్న చినకోటిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ తాళ్లూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి కార్యాచరణ ప్రకటించి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తదనంతరం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, విద్యాలయం ఏర్పాటు, గ్రామంలో అంతర్గత రోడ్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టాడు. తన కుమారుడు ఐవీ రెడ్డి సహకారంతో తాళ్లూరులో రుద్రభూమి పలు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేశారు. ఆయన కొంతకాలంగా వయోభారంతో తాళ్లూరులోని తన నివాసంలో సేద తీరుతూ మృతి చెందాడు. ఆయనకు ఇరువురు కుమారులు, కుమార్తెలు కాగా ప్రస్తుతం కుమారుడు ప్రముఖ కాంట్రాక్టర్ ఐవీ రెడ్ది (పూనే), ఇరువురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల వైసీపీ జిల్లా అధ్యక్షుడు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధు సూధన్ రెడ్డి, గ్రామ వైసిపి నాయకుడు కోట కృష్ణారెడ్డి, మాజీ ఎం. పి. పి గోళ్లపాటి మోషే, మాజీ నర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిలు ప్రగాడ సానుభూతిని తెలిపి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు.

