గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్ లో
వున్న భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందనిఎంపీడీవో పి. అజిత అన్నారు. మండలంలోని మల్కా పురం గ్రామంలోని స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద ఒకనెల, ఒకగ్రామం, నాలుగు దఫాల గ్రామ సందర్శన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సంద్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ గ్రీవెన్ సెల్ నందు భూసమస్యలపైనే అధికంగా ధరఖాస్తులు అందుతున్నందున వాటిని త్వరిత గతంగా పరిష్కరించటంపై ప్రత్యేక దృష్టి సారించిం దన్నారు. త హ సీల్దార్ జి ఫణీంద్ర మాట్లాడుతూ రైతాంగం మ్యుటేషన్ సవరణలు, క్రమ, విక్రయాలద్వారా జరగాల్సిన మ్యుటేషన్లు, నోషనల్ కాతాలను రెగ్యులర్ ఖాతాలుగా మార్చేందుకు, జీరో ఖాతాలను రెగ్యులర్ చేసేందుకు, సాధానామా క్రమబద్ధీకరణ, రీసర్వే సమస్యలపై, సరిహద్దుసమస్యలు, పొలంగట్లు, రహదారి వివాదాలు, కుటుంబంలో ఉమ్మడి భూముల వివాదాలు, సర్వే నంబర్ల సవరణ క్రమబద్ధీకరణ, రీసర్వేసమస్యలపై, సరిహద్దుసమస్యలు, పొలంగట్లు, రహదారి వివాదాలు,
సర్వే నంబర్ల సవరణ సమస్యలు, రికార్డుల్లోకి ఎక్కని సర్వే నంబర్ల సమస్యల వంటి విషయాలపై రైతాం గం ధరఖాస్తులు అందజేయాలన్నారు. ఈధరఖాస్తులను స్వీకరించి రసీదు కూడా అందజేయటం జరుగుతుందన్నారు. మొదటి గురువారం స్వీకరించిన ధరఖాస్తు లను రెండో గురువారం వచ్చినపుడు గతంలో వచ్చిన అర్జీల పురోగతి గురించి తెలియజేయటం జరుగుతుందన్నారు. మూడవ వారం అర్జీలకు పరిష్కారం చూపి సమ స్యలను పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుందన్నారు. మూడవ వారంఅర్జీలకు పరిష్కారం చూపి సమ స్యలను పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుందన్నారు. నాలుగవ వారం గ్రామసభ నిర్వహించి పరిష్కరించిన సమస్యలు, పరిష్కరించరించని స మస్యలు, ఏకారణం చేత పెండింగ్ వుందో తెలియ జేయటం జరుగుతుందన్నారు. నాలుగు దఫాలుగా అధికారులు గ్రామానికి వచ్చి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతారన్నారు. గ్రామంలో 18 ధరఖాస్తులు అందాయని, రెవెన్యూ సమస్యలు 17, నీటిసమస్యకు ఒక ధరఖాస్తు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రత్యేకాధికారి జి.సుబ్బయ్య, మాజీ సర్పంచ్ షేక్ ఖాసీం సైదా, మండల సర్వేయర్ మహేష్ బాబు, మండల ఆస్ఐ సుధీర్ కుమార్. వి ఆర్వో నాగూర్ బీ,పం చాయతీ కార్యదర్శి శేషమ్మ, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది రైతులుపాల్గొన్నారు.
