సీఎం ప్రజావాణిలో 392 దరఖాస్తులు

హైదరాబాద్ మే 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన 223వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 392 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 156, రెవెన్యూ శాఖకు సంబంధించి 34, ఇందిరమ్మ ఇండ్ల కోసం 118, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 82 దరఖాస్తులు అందాయి.
సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *