సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలో 225 కేసులు నమోదు. రూ 2.25000జరిమానా.

హైదరాబాద్, మే 19, (జే ఎస్ డి ఎం న్యూస్)
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ రూ 2.25000 జరిమానాలు విధించారు.తనిఖీలలో భాగంగా బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వినియోగిస్తున్న వాహనదారులపై మోటార్ వెహికిల్స్ యాక్ట్ (MV Act) ప్రకారం కఠిన చర్యలు చేపట్టారు.మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ డ్రైవ్‌లో భాగంగా కాంటాక్ట్ సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించిన 150 కేసులు, నాన్-కాంటాక్ట్‌కు సంబంధించిన 75 కేసులు నమోదు చేసి మొత్తం 225 కేసులు బుక్ చేశారు. ఇందుకు సంబంధించి ₹2,25,000 జరిమానా విధించారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో బేగంపేట ట్రాఫిక్ సీఐ జనకిరాములు, ఎస్ఐ హరీష్, శివరాజ్, విజయ్‌కాంత్ తదితర సిబ్బంది పాల్గొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ జానకి రాములు మాట్లాడుతూ వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని, వాహనం నడుపుతున్న వారితోపాటు ఇతరుల ప్రాణాలకు ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఇది MV Act Section 184 & 177 కింద శిక్షార్హమైన నేరమని హెచ్చరించారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *