ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, ప్రథమ చికిత్స కిట్ల పంపిణీ.

బేగంపేట జూన్ 5,
(జె ఎస్ డి ఎం న్యూస్)
ప్రమాదాలు జరిగినపుడు ఆటో డ్రైవర్లు తక్షణ కర్తవ్యంగా గాయపడిన వారికి ప్రధమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్)చేయాలి అనే ఉద్దేశ్యంతో ఆటో డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందించామని తిరుమల గిరి ట్రాఫిక్ ఏ సి పి జి.శంకర్ రాజుఅన్నారు.శుక్రవారం తిరుమల గిరి డివిజన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శంకర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగాపాటించాలన్నారు.వాహనాలను బాధ్యతా
యుతంగా నడపాలన్నారు.
మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు.రోడ్ ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రధమ చికిత్స అందించేందుకు వారికి ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించామని ఆయన అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకపోవడం, బాధ్యతాయుతంగా వాహనం నడపడం, ప్రయాణికులభద్రతను నిర్ధారించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు వినియోగదారులందరికీ సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణం కల్పించడంలో భాగస్వాములు కావాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులసమయంలో ప్రమాదబాధితులు మరియు గాయపడిన వారికి తక్షణసహాయం అందించేందుకు ఆటో డ్రైవర్లు ముందుండే అవకాశంఉన్నందు వల్ల , అపోలో హాస్పిటల్స్ సహకారంతో వారికి ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్లు పంపిణీ చేయబడినవి. వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే వరకు ప్రమాద బాధితులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేందుకు ఈ కిట్లనుసమర్థవంతంగా వినియోగించాలని ఏసీపీ సూచించారు. ప్రజా భద్రతా కార్యక్రమానికి సహకరించిన అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి ఆయనఅభినందనలు తెలియజేశారు.
ఇదే విధంగా ఇతర ఆసుపత్రుల యాజమాన్యాలు మరియు ఆరోగ్య సంస్థలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే, భవిష్యత్తులో మరింత మంది ఆటో డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇటువంటి సహకారంతోఅత్యవసర పరిస్థితుల్లో స్పందన సామర్థ్యం మరింత బలోపేతం కావడంతో పాటు ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రమాదాల నివారణ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం పట్ల తిరుమల గిరి డివిజన్ ట్రాఫిక్ విభాగం కట్టుబడి ఉందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *