అమీర్ పేట జూన్ 6,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట మైత్రీవనంసమీపంలో శనివారం మళ్లీ భారీ ప్రమాదం తప్పింది. ఇక్కడి ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ప్రమాదాలు జరగడంతో, మళ్లీ మంటలు చెలరేగడంపై స్థానికులు, వ్యాపారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
