జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సానే సురేష్ , ఈఓ నర్రా నారాయణ రెడ్డి, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. గుంటి గంగా భవాని ఆలయ అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు.
కెవీ పాలెం టిడిపి ఆధ్వర్యంలో నెల పొంగళ్లు నిర్వహణ..
కొర్రపాటి వారి పాలెం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి నెల పొంగళ్లు చెల్లించారు.
నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ సానే సురేష్, టిడిపి నాయకులు వేణుబాబు, రామయ్య, నరసింహా రావు, యలమంద రావు, చిరంజీవి పార్టీ కార్యకర్తలు అమ్మవారిని సందర్శించుకుని చల్లగా చూడాలని వేడుకున్నారు.
కొత్త పాలెం టిడిపి ఆధ్వర్యంలో అమ్మవారికి పొల పొంగళ్లు చెల్లించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



