అంగన్వాడీ పాఠశాలలో తాచుపాము కలకలం విద్యార్థులు ఉన్న గదిలోకి వచ్చిన పాము అప్రమత్తమైన స్థానికులు.. పామును పట్టి వేత

తాళ్లూరు మండలంలోని రజానగరం గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలో శనివారం తాచుపాము కన పడటంతో చిన్నారులు భయాందోళనకు గురైనారు. పాఠశాల సమయంలోనే పాము లోపలికి రావడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయి అప్రమత్తం అయ్యారు. విషయాన్ని స్థానికుల దృష్టికి తేవటంతో వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థులను నురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం పామును గుర్తించి కొట్టి చంపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల పరిసరాల్లో పొదలు, చెత్త లేకుండా శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *