ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బండారు కార్తీక్ (573) శనివారం విడుదల అయిన ట్రిపుల్ ఐటీ ఫలితాలలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు. ఉత్తమ ఫలితం సాధించిన విద్యార్థి కార్తీక్, ఆయన తల్లిదండ్రులు దుర్గా ప్రసాద్లను జిల్లా కలెక్టర్ రాజా బాబు, ఎంఈఓలు అభినందించారు. అదే విధంగా ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావటబం పట్ల పాఠశాల హెచ్ఎం అనంత పద్మారావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసారు. విద్యార్థులకు అభినందనలు చెప్పారు.
