నగరానికి చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్………..

బేగంపేట ,జూన్ 12,(జె ఎస్ డి ఎం న్యూస్) :
రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం నగరానికి వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. దిల్లీ నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన ఉదయం 11.59 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామ చంద్రరావు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన 12.10 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన జూబ్లీహిల్స్లోని రోడ్ నెం.26లో ఏర్పాటు చేసిన సమావేశానికి తరలివెళ్లారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *