తాను పని చేస్తున్న పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసం హెచ్ఎం శ్రీనివాసరావు దాతల సహకారంతో విద్యార్థులకు అ వసరమైన పరికరాలు సమకూర్చటం అభినం దనీయమని ఎంఈవో జి.సుబ్బయ్య అ న్నారు. స్థానిక తాళ్లూరు ఎంపీపీ (ఏఏ) విద్యార్థులకు దాతల సహకారంతో సమకూర్చిన విద్యార్థులకు అవసరమైన పరిక రాలు, ప్రభుత్వ పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ను శుక్రవారం అం దజేశారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ హెచ్ఎం త్రిపురారిబొట్ల శ్రీనివాసరావు సమాజ సేవలో ముందుంటూ, తాను పాఠశాల అభివృద్ధికి సహకరించటంతో పాటు దాతల ద్వారా నిధులు సమకూర్చి విద్యార్థులకు చేదోడు వాదోడుగా వుంటు న్నారన్నారు. ఉపాధ్యాయులు ఇలా పని చేస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత వృద్ధి చెందుతాయాన్నరు.
ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ శింగరాజు మీరాకుమారి పాఠ శాలకు సమకూర్చిన మైక్ సెట్ ,
కావలి గ్రామానికి చెందిన గునుపూడి పవన్ సమకూర్చిన నోట్ బుక్స్ , పెన్సిల్లు, ఎరైజర్లు, చాక్మర్లు వంటి పరికాలను, ప్రభుత్వ విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్సు ఎంఈవో జి.సు బ్బయ్య, హెచ్ఎం టి.శ్రీనివాసరావులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పా ల్గొన్నారు.
