ప్రతి నిత్యం యోగా చేసి ఆరోగ్యం సంరక్షించుకోవచ్చని ఇంచార్జి ఎంపీడీవో వంకాయలపాటి శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం యోగా కార్యాక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా ఇంచార్జిఎంపీడీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింద న్నారు. నిత్యంవత్తిడితో వుండే ప్రజలు, ఉద్యోగులు ప్రశాంతంగా వుండాలన్న తలం పుతో రాష్ట్రాన్ని గత ఏడాది యోగాంద్రగా ప్రకటించిందన్నారు. ఆరోగ్యాంద్ర సహకారం కోసవడివడిగా అడుగులు వేస్తూ ప్రతి వ్యక్తికి యోగాపై శిక్షణ ఇస్తున్నదన్నారు. ప్రతి వ్యక్తి నిత్యజీవితంతో యోగా చేయటం వల్ల ఆరోగ్య వంతులుగా వుంటారన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు కొండలు, తేజశ్విని, జిల్లా బీజేపీ మాజీకార్యవర్గ సభ్యులు చందోలు రామారావు, ఎంఎంఎస్అధ్యక్షరాలు ఎం.సుజాత, పం చాయతీ కార్యదర్శి వెంకటాద్రి, రామారావు, విఓఏ కోట అంజమ్మ,స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
