వాతావరణ పరిస్థితులను
అనుసరించి వ్యవసాయ పద్దతులను మార్పు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు-1, కొత్త పాలెం గ్రామాలలలో మంగళవారం పొలం పిలుస్తుంది. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయా ధికారి ప్రసాదరావు మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభా వంతో వాతావరణంలో మార్పులు సంభవించి జూన్లో 60 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదు అయినదని ఎండ తీవ్రత ఉందని 39 నుండి 40 డిగ్రీల వేడి నమోదు అవు తుందని అన్నారు. వాతావరనా
నికి అనుగుణంగా సాగు రకాలను, సాగు పద్దతులను మార్పు చేసుకుని ముందుకు సాగాలని కోరారు. ఉద్యాన వనశాఖాధికారి తేజ మాట్లాడుతూ పండ్ల తోటలు విస్తరణ పథకం క్రింద తోటలు, కూర గాయలు పూల తోటలకు రాయితీ ఇవ్వబడుతుందని అన్నా రు. పండ్ల తోటలను విస్తీర్ణం పెంచి రాయితీలు అంది స్తుందని చెప్పారు. ఎఈఓ సుబ్బా రెడ్డి, విఏఏ సాయిరాం, విఎహెచ్ జయరావు, ప్రకృతి సాగు ఇన్చార్జి నాగేశ్వర రావు, ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

