ఓటర్ల జాబితా ప్రత్యేక నమగ్ర నవరణ (సర్ ) ను నూరు శాతం డిజిటైజేషన్ పూర్తి చెయ్యాలని తహసీల్దార్ బి వి రమణా రావు నూచించారు. తాళ్లూరులో పలు కేంద్రాలను నందర్శించి సర్ నమోదు వివరాలను పరిశీలించారు. ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ డిజిటైజేషన్ తీరును పరిశీలించారు. మండలంలో ఓటర్లు 38,085 మంది ఉండగా ఇప్పటికే 37,800 డిజిటైనేషన్ చేసి 99.25 శాతం నమోదు అయినట్లు చెప్పారు. మిగిలిన వారి వివరాలు కూడ రేపటి లోపు పూర్తి చెయ్యాలని చెప్పారు. బిఎల్ ఓ లు గైర్హాజరు, వలస , మరణించిన వారి వివరాలు సేకరించి జాబితాలు తయారు చెయ్యాలని చెప్పారు. ఈనెల 21న డ్రాఫ్ట్ ఓటరు లిన్ట్ ప్రచురించబడుతుందని, జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు అభ్యంతరాలు స్వీకరణ, విచారణ జరుగునని, ఓటర్లు అందరూ కూడ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బిఎల్ ఓ లు మరింత అప్రమత్తంగా వ్యహరించి పూర్తి వివరాలు మంగళ వారం లోపు నమోదు చెయ్యాలని కోరారు.
