విద్యుత్ బిల్లులను నకాలంలో వసూలు చెయ్యాలి ఈఈ శ్రీనివాస రావు

విద్యుత్ బిల్లులను నకాలంలో వనూలు చెయ్యాలని, నాణ్యమైన విద్యుత్ ను అందించటమే లక్ష్యంగా విద్యుత్ సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని ఈ ఈ శ్రీనివాస రావు కోరారు. తాళ్లూరు నబ్ స్టేషన్ పరధిలో సోమవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యుత్ సిబ్బందితో విద్యుత్ బిల్లులు వనూలు, లైన్ మెయింటెన్స్ తదితర సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్ బిల్లులతో పాటు, ఎస్సీ, ఎస్టీ కాలనీలో అత్యధికంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వసూలు చెయ్యాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితం అని అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేయించి లబ్ధి అందేలా చూడాలని, అర్హత లేని వారి వద్ద బిల్లులు వసూలు చెయ్యాలని కోరారు. సోలార్ విద్యుత్పై అవగాహన పెంచాలని కోరారు. సిబ్బంది సక్రమంగా పనిచేయక పోతే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, వినియోగదారుల నుండి ఫిర్యాదు అందినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఈ రామక్రిష్ణా, ఎల్ ఐ శ్రీనివాస రావు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *