ఎర్రగడ్డలో ఫార్చ్యూన్ హోండా ప్రత్యేక షోరూం ప్రారంభం…

సనత్ నగర్ జులై 13(జే ఎస్ డి ఎం న్యూస్) :
ద్విచక్ర వాహన ప్రియులకు హోండా సంస్థ మరింత చేరువైంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్‌కు చెందిన ‘ఫార్చ్యూన్ హోండా బిగ్‌వింగ్’ తన సరికొత్త ప్రత్యేక షోరూమ్, వర్క్‌షాప్‌ను సోమవారం ఎర్రగడ్డలో ఘనంగా ప్రారంభించింది. ఎర్రగడ్డలోని మెట్రో పిల్లర్ నంబర్ A-975 ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ ప్రీమియం షోరూమ్‌ను హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్ మేనేజర్ (డీలర్ డెవలప్‌మెంట్) టికేంద్ర ప్రతాప్ సింగ్, ఏరియా సర్వీస్ ఇన్‌చార్జ్ హరీష్ హవాజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ హోండా బిగ్‌వింగ్ డైరెక్టర్లు నిరవ్ మోదీ, ఆశిష్ మోదీ, సీఈఓ పీటర్ పాల్, సీఎఫ్‌ఓ రవి ప్రకాశ్ సహా పలువురు కంపెనీ ప్రతినిధులు, వినియోగదారులు పాల్గొన్నారు.
హోండా సంస్థకు చెందిన 300 సీసీకి పైబడిన ప్రీమియం మోటార్‌సైకిళ్ల విక్రయాలు, విడిభాగాల సేవల కోసం ఈ బిగ్‌వింగ్ షోరూమ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సరికొత్త షోరూమ్‌లో CB350 హైనెస్, CB350RS, CB350C, NX500, XL750 ట్రాన్స్‌ఆల్ప్, హార్నెట్ 750 వంటి అధునాతన మోడళ్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వాహనాల కొనుగోలుతో పాటు టెస్ట్ రైడ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సదుపాయాలను ఒకే చోట కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ఫార్చ్యూన్ హోండా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని ద్విచక్ర వాహన ప్రియులకు ప్రపంచ స్థాయి ప్రీమియం మోటార్‌సైక్లింగ్ అనుభవాన్ని మరింత చేరువ చేయడమే తమ ముఖ్య లక్ష్యమన్నారు. అత్యుత్తమ సేవలందిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని చెప్పారు. కేవలం విక్రయాలకే పరిమితం కాకుండా, అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలు, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో కూడిన ఆధునిక సర్వీస్ వర్క్‌షాప్‌ను కూడా ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. జెన్యూయిన్ యాక్సెసరీస్‌తో పాటు రైడింగ్ కమ్యూనిటీ కార్యక్రమాలకు కూడా ఈ షోరూమ్ వేదిక కానుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *