ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్ మరియు పోలీసు అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)”కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుంచి వ్రాతపూర్వక వినతిపత్రాలు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు, వారితో ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలను విని, సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, కందుకూరు సీఐ అన్వర్ బాషా, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాసిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

