ఆంధ్రప్రదేశ్ ప్రసూతి మరియు స్త్రీ వైద్య శాస్త్ర సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలులో రాష్ట్రస్థాయి సదస్సు-సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

ఆంధ్రప్రదేశ్ ప్రసూతి మరియు స్త్రీ వైద్య శాస్త్ర సొసైటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ హెల్త్ నేషన్స్ ప్రైడ్” అనే నినాదంతో ఒంగోలులో 3 రోజుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కీనోట్ ఉపన్యాసాలు, సైంటిఫిక్ పేపర్ ప్రజెంటేషన్లు మరియు ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. రెండవ రోజు శనివారం ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బి. ఎన్ విజయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…స్త్రీల ఆరోగ్యంపై దృష్టి సారించే కీలకమైన రంగాలు గైనకాలజీ, ప్రసూతి శాస్త్రం మరియు పునరుత్పత్తి ఆరోగ్యం. ఈ సదస్సు..స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యం, గర్భధారణ ఫలితాలు మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న అద్భుతమైన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న పద్ధతులు మరియు వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తుందన్నారు. శాస్త్రీయ పురోగతులు మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ద్వారా సంరక్షణను మెరుగుపరచడంపై దృష్టి సారించడం అభినందననీయం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. గర్భిణీ, బాలింత మహిళలకు అంగన్వాడి కేంద్రాలతో పౌష్టిక అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *