ఏ తల్లి కన్న పసిబిడ్డ ఊరు చివర ఈ రాత్రి సమయంలో జొన్న చేలు విసిరేబడ్డ పసి శిశువు దయానియా పరిస్థితి వివరలోకి వెళితే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం గ్రామ శివారులో అద్దంకి వెళ్లే మార్గంలోని జొన్న చేలో ఆడపిల్ల పుట్టింది అనే భారమైందో?, అక్రమ సంతానంగా పుట్టింది అనే ,?అనారోగ్య సమస్యలతో పుట్టిందిఅనే ? కారణంతోనో,కారణలు ఏమైనా ఒక తల్లి మానవత్వాని అమ్మ తనాన్ని అని మర్చిపోయి కర్కస్యంగా ఒక ఆరు రోజుల బ్రతికి ఉన్న ఆడ శిశువును జొన్న చేలో పాపను పారవేయడం జరిగినది ఆ పసిపాప లేత శరీరంపై వీచే గాలుల ద్వారా జొన్న చేను ఆకులు శరీరంపై రాపిడి జరగడం ద్వారా రక్త స్రావం కావటం అవటం దాహం కలగటం బిగ్గరగా ఏడుస్తున్న తన ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేక రాత్రి అంత ఆ జొన్న చేలో పసి హృదయం ఆవేదనలతో ఆక్రందనతో అల్లాడుతూ ఉండిపోయింది తెల్లవారుజామునగ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఊరు బయట బహిర్భూమికి వెళ్లిన వాళ్లకి పసిపాప యొక్క ఏడుపులు వినిపించడంతో వెంటనే వారు ముండ్లమూరు ఎస్సై ఎం కోటేశ్వరరావు కు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ కు ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి వెంటనే ఈ విషయాన్ని జిల్లా మహిళా శిక్షణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ. పద్మ సునంద ఆదేశాల మేరకు పసిపాపను ముండ్లమూరు అంగన్వాడి సూపర్వైజర్ బి ఇంద్ర అంగన్వాడీ కార్యకర్త కల్పన హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఔట్రిచ్ వర్కర్లు టీ. దుర్గ భవాని వి. మల్లేశ్వరి సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే పాపను సంరక్షణకు తీసుకుని స్థానిక అంబులెన్స్ లో ప్రధమ వైద్య చికిత్స నిమిత్తం అద్దంకి కమిటీ హెల్ప్ సెంటర్ కు తీసుకురావడం జరిగినది స్థానిక డాక్టర్లు పాప యొక్క ఆరోగ్య స్థితిని పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవ నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించడం జరిగినది స్థానిక ఒంగోలు రిమ్స్ హాస్పటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి లత రిమ్స్ పిల్ల వైద్య నిపుణులు డాక్టర్ తిరుపతి రెడ్డి పర్యవేక్షించి పాప యొక్క ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని శరీరం జొన్న చేలోనే ఆకులు రాపిడి ద్వారా మొఖంపై చేతులపై కొంత గాయాలు కావటం జరిగిందని పూర్తి వైద్య పరీక్షలు చేసి పాపకు మెరుగైన వైద్య సేవలు అందించి పాపకు ఎటువంటి ప్రాణహాని లేకుండా పూర్తి వైద్య సేవలు అందిస్తామని తెలియజేసినారు పాప పూర్తిగా ఆరోగ్యం కోరుకున్న తర్వాత పాపను ఒంగోలు రాంనగర్ లోని మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడేటటువంటి శిశు గృహాలు చేర్పించడం జరుగుతుందని శిశు గృహాలు చేర్పించడం జరుగుతుందని పోలీసు వారి యొక్క పాపను ఎవరు పారేశారు అనేది తెలుస్తుందని వారిపట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా బిడ్డలను పెంచలేమని గాని భారం అనుకున్న ఆడపిల్ల పుట్టిందని వివక్షత ఉన్న అనారోగ్యంతో పుట్టారని ఒక అపోలో ఉన్న ఎవరు మీ బిడ్డల్ని కర్కసంగా మానవత్వం మర్చిపోయి పసిబిడ్డలను మూళ్ళ పొదలో లేదా ఆ బిడ్డలకు ఎటువంటి ప్రాణాన్ని కలిగించకుండా జిల్లా మహిళా, సంక్షేమ శాఖ అధికారులు కానీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గాని, జిల్లా బాలల సంరక్షణ అధికారులు గానీ సమాచారం ఇచ్చినట్లయితే వారిని మా సంరక్షణలోకి తీసుకుని వారికి రక్షణ సంరక్షణ కలిగించడం జరుగుతుందని ఎవరు ఆ పసి హృదయాన్ని పార వేయవద్దు చంపవద్దని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిఏ. పద్మ సునంద పేర్కొన్నారు.



