సికింద్రాబాద్ జులై 19 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆదివారంఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం మంత్రిమాట్లాడుతూతెలంగాణరాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతాంగంతో పాటు సబ్బండ వర్గాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా, సకాలంలో వానలు పడి ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో మంచి వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేయాలని భక్తులకు, పూజారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.



