మోటారు ఫ్యూజులు
వేస్తుండగా
విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ
విషాద ఘటన తాళ్లూరు మండలం
లోని తురకపాలెం గ్రామ పొలాలలో
బుధవారం చోటుచేసు
కుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చంద్రగిరి వెంకటరెడ్డి (53) ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. మోటారు వేయగా
నీరు రాకపోవడంతో కరెంట్ లేదని గమనిం
చాడు. సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజులు వేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడి
చాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
వెంకటరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛా
యలు అలుముకున్నాయి. ఘటన స్థలాన్ని తాళ్లూరు పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

