చింతల పాలెం రామాలయం ప్రతిష్ట జరిగి 40 రోజులు అయిన సందర్భంగా గ్రామంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు డాక్టర్ గాజుల పల్లి గౌతమ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులచే ప్రత్యేక పూజ నిర్వహించారు. మహిళలు రామ నామ సంకీర్తన చేసారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో హెూమాలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు .
