బేగంపేట ఆగస్టు 6 (జే ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ కే. పద్మావతి జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
92 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను బిఏ విద్యార్థులు ఘనంగానిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ సేవలనుకొనియాడారు.ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్రాల అధ్యాపకులు టి భాస్కర్ రెడ్డి , జీ నరసింహులు ఏం. రామాచారి వెంకటేశ్వర్లు , రాఘవి, మృదుల బిఎ అన్ని స్ట్రీమ్ల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించారనీ. వక్తలు కొనియాడారు.
ఆయన విద్యార్థి దశ నుండి జీవిత చరమాంకము వరకు తెలంగాణ తన శ్వాసగా తన ధ్యాసగా తెలంగాణ భావజాలాన్ని మూడు తరాల తెలంగాణ ప్రజలకు అందించిన మహా వ్యక్తిగా తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రఖ్యాతిగాంచిన ఆ మహనీయుని కళాశాల విద్యార్థులు స్మరించుకున్నారు . ఈ కార్యక్రమాన్ని బి ఏ పొలిటికల్ సైన్స్ ఆనర్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

