జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ ఓ,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు.

సికింద్రాబాద్ ఆగస్టు 6 (జే ఎస్ డి ఎం న్యూస్) సికింద్రాబాద్ ఉజ్జయినీమహంకాళి బోనాల జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. ఆలయ ఈవో జి. మనోహర్ రెడ్డి, ధర్మకర్తలు గౌరపల్లి రమేష్, రాజేందర్ ముదిరాజ్, ,దేవి వరప్రసాద్, భాస్కర్ గుప్తా, శ్రీకాంత్ చారి, డాక్టర్ శివలాల్, రాకేష్ అగర్వాల్, సంజయ్ఉపాధ్యాయ, అగర్వాల్, సోనాలి, గీత, రమేష్, హేమంత్ సింగ్, మల్లికార్జున్, ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులు రామతీర్థ శర్మ, తదితరులు కలిసి ఆలయ ఆవరణలో గురువారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షల మంది భక్తులు పాల్గొన్న ఈ జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ , దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు, జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసు, ఆర్ అండ్ బి, హెల్త్, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు లక్షల మంది పాల్గొన్న జాతర విజయవంతం కావడానికి ఆహర్నీశలు కృషి చేశారని అన్నారు. భవిష్యవాణిలో అమ్మవారు చెప్పిన విదంగా విగ్రహ ప్రతిష్ట విషయం కోర్టు పరిధిలో ఉండటంతో దానిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయాన్ని తమ నాయకురాలు కోట నీలిమనేతృత్వంలో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం అన్నారు. త్వరలోనే జాతర విజయవంతం చేసిన
వారందరికి వారి సేవలను గుర్తించి ఈ నెల 8వ తేదీన చిరు సత్కారం చేస్తామని వారు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *