తాళ్లూరు మండలంలోని మాధవరం గ్రామానికి
చెందిన వైసీపీ మండల రైతు విభాగం జనరల్ సెక్రటరీ మూల భాస్కర్ రెడ్డి సతీమణి నాగేశ్వ రమ్మ దశదిన కర్మకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి
హాజరై నాగేశ్వరమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగేశ్వరమ్మ మృతిపై తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మేధావుల సంఘ కార్య దర్శి ఐవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా సెక్రటరీ మారం ఇంద్రసేనారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నుసుంరాజ మోహన్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, మాజీ సర్పంచ్ కోట వెంకటరామిరెడ్డి, విద్యార్థి సంఘ అధ్యక్షుడు కైపు అశోక్ రెడ్డి, గ్రామ నాయకులు తూము వెంకటేశ్వరరెడ్డి, నారాయణ సెట్టయ్య, సోషల్ మీడియా బాధ్యుడు కొణికి గోవిందరాజులు, లోకిరెడ్డి హనుమారెడ్డి, తిప్పిరెడ్డి ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


