పెట్టుబడి తక్కువగా ఉండి రాబడి ఎక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు పిలుపునిచ్చారు . శుక్రవారం ఉదయం మద్దిపాడు మండలంలోని నటరాజు కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ జిల్లాలో ఎల్ నినో ప్రభావం ఉన్నందున రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ఉండే పంటలను వేసుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకే రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చి తద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించి ఏ ఏ పంటలు వేసుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. వాతావరణానికి అనుగుణంగా రెగ్యులర్ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు.
సముద్రంపై ఉష్ణోగ్రతల తారతమ్యం వల్ల మేఘాలు వచ్చినప్పటికీ వర్షాలు సకాలంలో ఉండవని దానిని దృష్టికి లభించుకొని రైతులు పంటలు వేసుకోవాలన్నారు. రైతులు ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకుని అవగాహన పెంపొందించుకొని వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను వేసుకోవాలన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని దానిని ఎదిరించే విధంగా పశువులను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు ప్రభుత్వ యంత్రాంగం పరస్పరం కలిసి పనిచేసి ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే విధంగా పంటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఎన్ నినో ప్రభావం జిల్లా పై ఉందని సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. వర్షా భావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలు వేసుకోవాలని ఆయన తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల పాసుగ్రాసం కొరత ఏర్పడుతుందన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్ మాట్లాడుతూ వర్షా భావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటినిఅవసరం తక్కువగా పంటలను వాడాలన్నారు. ఉదాహరణకు కంది మొక్కజొన్న వంటి చిరు దాన్యా పంటలను వేసుకోవాలని ఆయన సూచించారు. తక్కువ కాలంలో పంటలు చేతికి అంది వచ్చే పంటలు వైపు రైతులు మొగ్గు చూపాలని.ఈ సందర్భంగా పలువురు రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పిఎండిఎస్ విత్తనాలు అందించడంతోపాటు గోడపత్రికను జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఆవిష్కరించారు.

