హైదరాబాద్ ఆగస్టు 7,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రముఖ నాట్య, సంగీత విద్వాంసురాలు, వర్ణ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ స్మితా మాధవ్ శిష్యురాలు కుమారి అమృత ముత్యాల భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన ‘వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ యూనివర్సిటీ డాన్స్ విభాగం అధిపతి అరుణ భిక్షు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధా దేవి ముత్యాల, కిశోర్ బాబు ముత్యాల దంపతుల కుమార్తె అయిన కుమారి అమృత, భరతనాట్యంలో విశేష సాధన చేసి భరతనాట్య రంగ ప్రవేశం చేయడంఅభినందనీయమన్నారు. గురు డాక్టర్ స్మితా మాధవ్ భారతీయ సంస్కృతి, కళలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్ణ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు నాట్య శిక్షణను
అందిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. అకాడమీ భరతనాట్య విభాగాధిపతి భార్గవి పరమేశ్వరన్ సహాయ సహకారాలు అందించారు.అమృత ముత్యాల 2018 లో మూడవ తరగతి చదువుతున్నప్పుడు
గురువుడాక్టర్ శృతి కీర్తి పర్యవేక్షణలో కూచిపూడి నృత్యంతో తన శాస్త్రీయ నృత్య ప్రస్థానాన్ని ప్రారంభించింది. చిన్నతనం నుండే అమృత కి భారతీయశాస్త్రీయం,క్రమశిక్షణ కు ఆకర్షితులైంది. డాక్టర్ స్మిత మాధవ్, భార్గవి పరమేశ్వరన్ ఆశీస్సులతో వర్ణ ఆర్ట్స్ అకాడమీలో చేరింది. కళారూపాలను అంకితభావంతో నిరంతరం నేర్చుకుంటూ పరిణతి చెందుతూ ముందుకు సాగింది. భగవాన్ నటరాజ అనుగ్రహం మరియు తన గురువులమార్గదర్శకత్వంతోనేపాల్,తిరుపతి, అయోధ్య, కాశీ,వంటి పవిత్రప్రదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.
అమృత ముత్యాల ప్రస్తుతం పేజ్ జూనియర్ కళాశాలలో 11వ తరగతి చదువుతుంది.చదువుతోపాటు నృత్యం, బాస్కెట్ బాల్ కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటుంది. అమృత ముత్యాల మాట్లాడుతూ నా జీవితంలో ఈరోజు నేను చేసిన భరతనాట్య అరంగేట్రం ఒక మైలు రాయిగా నిలిచిపోయింది అని అన్నారు. ఇప్పటి వరకు ప్రదర్శించిన జగన్నాథ అష్టకం, సుందర నటరాజం, మాటే మలయ ద్వజ, తిల్లానా మంగళం అంశాలను చక్కగా నర్తించి కుటుంబ సభ్యులను ప్రేక్షకులను మెప్పించారు.
ఈ ప్రదర్శనకు నట్టువాంగం స్మిత మాధవ్,వాయిలిన్ ఎంబర్ స్ కన్నన్ మృదంగం కార్తికేయన్,ఫ్లూట్ శృతి సాగర్,వీణ భవానీ ప్రసాద్ఆర్కెస్ట్రా సహకారం అందించారు



