హైదరాబాద్, ఆగస్టు 8 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (ఆటోనమస్), బేగంపేట్, హైదరాబాద్కు చెందిన బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి మరియు PG కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం.జె. ఎలియట్ ప్రతిష్ఠాత్మక “IPA Best Commerce Faculty Award – 2026” అవార్డును అందుకున్నారు.
కామర్స్ విద్యారంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషి, బోధనలో చూపుతున్న ప్రతిభను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. IPA Sanman Awards 2026లో భాగంగా ఈ సత్కారం లభించింది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి నైపుణ్యాలు మరియు కెరీర్ అభివృద్ధికి ప్రొఫెసర్ ఎం.జె. ఎలియట్ చేస్తున్న కృషి
ప్రశంసనీయమని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఈ అవార్డు తనకు మాత్రమే కాకుండా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట కు కూడా గర్వకారణమని వారు పేర్కొన్నారు.
