రాష్ట్ర నాటక రంగా అకాడమి డైరెక్టర్ గా తాళ్లూరు మండలం తురకపాలెంకు చెందిన బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి
శనివారం ప్రమాణ స్వీకారం చేసారు. విజయవాడ లోని ఘంట శాల కళాక్షేత్రంలో శనివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన తన అనుయాయులతో కలసి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసారు. గతంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ గా ఓబులు రెడ్డి పనిచేసారు. తనకు రాష్ట్ర అకాడమి డైరెక్టగా అవకాశం కల్పించిన ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల కు ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పారు. పర్యావరణ, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర నాటక రంగా అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాల క్రిష్టలు ఆయనను నన్మానించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నాయకులు మానం రమేష్ బాబు, షేక్ పెద కాలేషా వలి (బడే), నవులూరి విద్యా సాగర్, గొల్లపూడి వేణుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, పిన్నిక రమేష్, తూము శివ నాగి రెడ్డి, రాచకొండ వెంకట రావు, కైపు నాగార్జున రెడ్డి, కైపు రామ కోటి రెడ్డి, నారిపెద్ది కళ్యాణ్, చాట్ల డానీ తదితరులు అధిక సంఖ్యలో తరలివెళ్లి ప్రమాణస్వీకారోత్సవాన్ని విజయవంతం చేసారు.

