బొద్దికూరపాడులో వర్షాలకు కురిసి పంటలు పండాలని, పశు పక్షాదులు శుభిక్షంగా
ఉండాలని రైతులను చల్లగా చూడాలని కోరుతూ శనివారం పోలేరమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. గ్రామస్తులు అందరూ ఐక్యంగా ప్రతి నివాసం నుండి మహిళలు చద్దిని ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకువెళ్లి అమ్మవారికి చెల్లించారు. పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

