తాళ్లూరు మండలం లక్క
వరం-1 గ్రామ మహిళా సంఘంపై ఏపీఎం,వెలుగు సీసీలు కక్ష కట్టి గత 8 నెలులుగా రుణాలు మంజూరుచేయడంలేదని పొదుపు మహిళలు
ఆరోపించారు. సోమవారం తాళ్లూరులోని
వెలుగు కార్యాలయం వద్దఆందోళనచేశారు.
ఈసందర్భంగా లక్కవరం గ్రామ మహిళాసంఘం అధ్యక్షురాలు లోకిరెడ్డి నాగలక్ష్మి, ఉపాధ్యక్షురాలు విప్పర్ల నరసమ్మ ఆధ్వర్యంలో
గ్రామసంఘంలోని మహిళలు ఏపీఎంను నిలదీశారు. ఏపీఎం దేవరాజ్ మాట్లాడుతూ
ఇందులో తమ ప్రమేయం ఏమి లేదన్నారు.
ఇటీవల కొత్త గ్రామసంఘంగా ఏర్పడినందున
వీవోకు ఐడీ రాలేదన్నారు. ఐడీ రాగానే
ల రుణాలు మంజూరవుతాయన్నారు. మహి
ళల ముందే స్త్రీనిధి ఏజీఎంతో మాట్లాడించగా
ఐడీ రాలేదని, ప్రత్యామ్నాయ మార్గంలో
స్త్రీనిధి రుణాలు మంజూరుచేస్తామని
చెప్పారు.