తూర్పు గంగవరం లోని పీహెచ్ సీలో వైద్యాధికారిణి డాక్టర్ కె. మౌనిక ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ కింద గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం ప్రత్యేక వైద్యశిబిరంలో 32మంది గర్భిణులకు డాక్టర్ మౌనిక వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఈవో చంద్రశేఖర్ బాబు, సిబ్బంది రమణమ్మ, సుశీల, కోటేశ్వరరావు, ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

