వర్షాలు పడినా పడక పోయినా విత్తన బంతులను తయారు చేసి ఖాళీ భూములలో, పండ్ల తోటల మధ్యలో పీఎండీఎన్ ను విత్తు పద్ధతులు అవలంభించి నేలను పచ్చదనం కప్పి ఉండేలా చూడాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. సోమవరప్పాడు, ఎకలవ్య నగర్లలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. విత్తన బంతులను పొలాలలో చల్లారు. వాతావరణ ప్రతి కూల పరిస్థితులు ఉన్నందున రైతులు ఈ పద్దతులు పాటించాలని వివరించారు. ఎఈఓ సుబ్బా రెడ్డి, విఏఏ సుప్రజ తదితరులు పాల్గొన్నారు.
