బేగంపేట ఆగస్ట్ 11,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దక్షిణ మధ్య (రైల్వే ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ )బ్యాండ్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్లో అద్భుతమైన సంగీత ప్రదర్శన నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవ 80వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా, ఈ బ్యాండ్ బృందం అనేక దేశభక్తి గీతాలతో పాటు ప్రజాదరణ పొందిన పాటలను ప్రదర్శించి,
స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికులను మరియు ప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలు
భారీ సంఖ్యలో తరలివచ్చి, ప్రదర్శనకారుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ నరేంద్ర కుమార్ వర్మ, మౌలాలిలోని ఆర్. పి. ఎఫ్ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ డి. శ్రీనివాసరావు, నాంపల్లి ఆర్. పి. ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్. సురేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించారు.

